బంటుమిల్లి మండల వ్యవసాయ కేంద్రం వద్ద వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా కృత్తివెన్ను, బంటుమిల్లి రైతులకు రూ. 25.74 లక్షల విలువగల వ్యవసాయ పనిముట్లను రాయితీపై ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం అందించారు. కృత్తివెన్ను, గూడూరు మండలాలలో రైతులకు పవర్ స్ప్రేయర్లు, దమ్ము సోట్లు, రోటవేటర్స్ పంపిణీ చేశారు. అనంతరం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన పాడి రైతులకు రాయితీపై దాణా పంపిణీ చేసారు.