బంటుమిల్లి గ్రామంలో మల్లేశ్వరం సెంటర్ లో ఉన్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పూలమాలవేసి సోమవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషి జీవితాన్ని, జీవన విధానాన్ని మార్చగలిగేది చదువు ఒక్కటే అని భారతీయ సమాజానికి డా. బి. ఆర్. అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయమన్నారు. భారతదేశం గొప్ప లౌకిక రాజ్యంగా వర్ధిల్లడం వెనుక ఆయన కృషి ఉందన్నారు.