బంటుమిల్లి: సీతారాములను దర్శించుకున్న ఎమ్మెల్యే

58చూసినవారు
బంటుమిల్లి: సీతారాములను దర్శించుకున్న ఎమ్మెల్యే
బంటుమిల్లి మండలం బంటుమిల్లి గ్రామంలో సంత మార్కెట్ శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో స్వామివార్లను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ శనివారం దర్శించుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, స్వామివారి ప్రసాదాన్ని ఎమ్మెల్యే అర్చక బృందం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్