బంటుమిల్లి: ఒఎన్జిసి సంస్థ నుండి ప్రజలను కాపాడండి

68చూసినవారు
బంటుమిల్లి: ఒఎన్జిసి సంస్థ నుండి ప్రజలను కాపాడండి
పర్యావరణ పరిరక్షణ లేని ఒఎన్జిసి సంస్థ నుండి బంటుమిల్లి మండలంలో గ్రామాల ప్రజలను కాపాడాలంటూ మండల డిసి చైర్మన్ బొర్ర కాశీవిశ్వేశ్వరరావు బందరు ఆర్డీఓ కె. స్వాతికి వినతిపత్రం అందజేశారు. మంగళవారం బంటుమిల్లి తహశీల్ధార్ కార్యాలయం వద్ద పర్యావరణ శాఖ వారు పర్యావరణ సంబందిత ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాశీ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ, ఓఎన్జిసి పర్యావరణ పరిరక్షణ తుంగలో తొక్కిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్