బంటుమిల్లి మండలం అముందాలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు గ్రామ ప్రజల సహకారంతో మురికి డ్రైన్ బాగు చేసి తూముల ఏర్పాటు చేశారు. ఆదివారం ఆ పనులను డీసీ చైర్మన్ బొర్రా కాశీ, అముందాలపల్లి సంఘ అధ్యక్షులు అబ్బూరి కిరణ్, ములపర్రు సంఘ అధ్యక్షులు చింత వెంకటేశ్వరరావు పరిశీలించారు. రైతు నాయకులు గొట్టిపాటి శ్రీనివాసరావు, గొట్టిపాటి హరికాంత్, జొన్నలగడ్డ కొండ, రైతులు పాల్గొన్నారు.