పెడన మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యల కోసం పనిచేస్తానన్నారు. ప్రజలు మున్సిపాలిటీ నిబంధనలకు లోబడి, అభివృద్ధికి సహాకరించాలని ఆయన కోరారు.