గూడూరు మండలంలో శారదాయి పేట సెంటర్లో సుల్తానగరం నుండి ముక్కొల్లు వరకు రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్ అండ్ బి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం బుధవారం జరిగింది. పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు