గూడూరు: ఆసుపత్రిలోనూ 'స్టెమి' గుండెకు భరోసా

56చూసినవారు
గూడూరు: ఆసుపత్రిలోనూ 'స్టెమి' గుండెకు భరోసా
గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలోనూ గుండెకు భరోసా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని సూపరింటెండెంట్ డాక్టర్ వి. నరేంద్ర తెలిపారు. బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను ఆసుపత్రి వైద్య బృందంతో కలిసి వెల్లడించారు. రోగులకు గుండెపోటు నిర్ధారణ అయితే రూ. 45వేల ఖరీదైన ఇంజక్షన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ వైద్య సేవలు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని సూచించారు.

సంబంధిత పోస్ట్