టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) గోశాలలో వంద గోవులు చనిపోయాయన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. ఆదివారం గూడూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గోశాలపై అవాస్తవపు ఆరోపణలు చేస్తూ. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.