మూలమరిగుంటలో బోరు ఏర్పాటు చేసిన టీడీపీ నాయకుడు

79చూసినవారు
మూలమరిగుంటలో బోరు ఏర్పాటు చేసిన టీడీపీ నాయకుడు
పెడన మండలం ఎస్వీ పల్లి పంచాయతీ శివారు మూల మర్రిగుంట గ్రామంలో సోమవారం నాడు బోరు ఏర్పాటు చేశారు. ఈ గ్రామస్తులకు తాగునీటి కొరత ఉందన్న విషయాన్ని పంచాయతీ టిడిపి నాయకుడు యరగాని వీర రాఘవులు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సుమారు పదివేల రూపాయలు ఖర్చుతో బోరు ఏర్పాటు చేశారు. చెప్పిన వెంటనే స్పందించిన వీర రాఘవులను గ్రామస్థులు అభినందించారు.

సంబంధిత పోస్ట్