కృత్తివెన్ను: కారు, బైకు ఢీ.. ఒకరు మృతి

78చూసినవారు
కృత్తివెన్ను: కారు, బైకు ఢీ.. ఒకరు మృతి
216 జాతీయ రహదారి చెరుకుమిల్లి అడ్డరోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. మునిపెడకు చెందిన కాకర ఫణి (38) బంటుమిల్లి నుంచి కృత్తివెన్ను వైపు బైక్‌పై వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫణి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్