మద్యం సేవించి వాహనాలు నడిపిన ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 80 వేలు జరిమానాను బంటుమిల్లి కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు విధించినట్లు కృత్తివెన్ను ఎస్ఐ పైడిబాబు శనివారం తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ, వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించి వారి వాహనాలను నడపాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు.