కృత్తివెన్ను మండలం ఎండపల్లి పంచాయితీ గాంధీనగర్ లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి గుడి మూడోవ వార్షికోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఆయనను ఘనంగా సత్కరించారు.