కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని చేపలు మరియు రొయ్యల చెరువులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2020 చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవలసినదిగా మత్స్య శాఖ కమిషనర్ డోలా శంకర్ ఆక్వా రైతులకు తెలియజేశారు. ఈ మేరకు ఆయన గురువారం కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలలో పర్యటించి ఆక్వా సాగును ఆయన స్వయంగా పరిశీలించారు. గరిసపూడి గ్రామంలో చేపల చెరువును పరిశీలించి సాగు విషయాలు అడిగి తెలుసుకున్నారు