కృత్తివెన్ను: యువకుడి అనుమానస్పద మృతి

84చూసినవారు
కృత్తివెన్ను: యువకుడి అనుమానస్పద మృతి
పల్లెపాలెం మడ అడవుల్లో వ్యక్తి అనుమానస్పదంగా మృతిచెందిన ఘటన కృత్తివెన్నులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై బుధవారం కృత్తివెన్ను పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పల్లెపాలెం గ్రామానికి చెందిన నాగేంద్రబాబు (25) బురదలో మునిగి చనిపోయాడన్నారు. దీనిపై మృతుడు నాగేంద్రబాబు తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్