కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పొడు గ్రామంలోని నాటు సారా స్థావరంపై శుక్రవారం పోలీసులు మెరుపుదాడి జరిపారు. 700 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 20 లీటర్ల నాటుసారా, నాటుసారాపాత్రలను, ప్లాస్టిక్ డ్రమ్ములను. ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశారు. నాటు సారా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు.