నందిగామ: సబ్సిడీపై విత్తనాలు పంపిణీ

81చూసినవారు
నందిగామ: సబ్సిడీపై విత్తనాలు పంపిణీ
పెడన మండలం నందిగామ గ్రామంలో మంగళవారం రాయితీతో కూడిన వరి విత్తనాలను పంపిణీ చేశారు. సర్పంచి బొడ్డు చినబాబు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే రాయితీ పధకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. యంత్ర పరికరాలు రాయితీపై అందించి రైతులకు వ్యవసాయ శాఖ ఎంతో తోడ్పాటు అందిస్తున్నట్టు తెలిపారు. టిడిపి నాయకులు యరగాని నాగరాజు, పిల్లంగోళ్ళ వెంకటస్వామి, ఏఈఓ ప్రసన్న రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్