పెడన: ఘనంగా సుపరిపాలనకు ఏడాది కార్యక్రమం

72చూసినవారు
పెడన: ఘనంగా సుపరిపాలనకు ఏడాది కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా "సుపరిపాలనకు ఏడాది" అనే కార్యక్రమం చేపట్టారు. బంటుమిల్లి, పెడన, గూడూరు మండలాలలో బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కేక్ కట్ చేసి ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. తొలుత ఆయా మండలాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్