ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదలకు వరంలాంటిదని పెడన ఎమ్మెల్యే కాగిత ప్రసాద్ పేర్కొన్నారు. పెడన నియోజవర్గంలోని గూడూరు, బంటుమిల్లి, పెడన కృత్తివెన్ను మండలాలలో అనారోగ్యంతో బాధపడుతున్న 19 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య సేవల నిమిత్తం రూ. 19, 76, 082 ఆర్థిక సహాయాన్ని బుధవారం అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.