పెడన: చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం

62చూసినవారు
పెడన పట్టణంలోని బ్రహ్మపురంలో కొలువై ఉన్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉటుకూరి సుధీర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్