పెడన: నాటు సారా నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలి

73చూసినవారు
పెడన: నాటు సారా నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలి
నాటు సారా నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వరమ్మ, ఎస్సై రామశేషయ్య ప్రజలకు తెలిపారు. ఆదివారం పెడన మండలం కోటవానిపాలెం గ్రామంలో కళా జాతర (వీధి నాటకం) ద్వారా నాటుసారా నిర్మూలన గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా నాటుసారా విక్రయిస్తున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాజాత సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్