పెడన పట్టణ పరిధిలోని డంపింగ్ యార్డులో ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విపరీతంగా పొగ వ్యాపించడంతో ప్రయాణికులు, ప్రజలు భయందోళనకు గురయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి మున్సిపల్ అధికారులకు తెలియజేసి అప్రమత్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మున్సిపల్, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.