జనసేన కార్యకర్తలపై దుర్భాషలాడి, ఇళ్లపైకి వచ్చి దౌర్జన్యం చేసిన తెలుగుదేశం నాయకుడి అరాచకాలను ఖండిస్తున్నట్లు జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. టీడీపీ నేత ఆగడాలకు వ్యతిరేకంగా గురువారం పెడన నియోజవర్గ జనసైనికులు శారదాపేటలోని జనసేన కార్యాలయంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. మా సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని రాష్ట్ర స్థాయి నేతలను కోరారు.