ప్రజలను మోసగించిన ఎన్డీఏ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని పెడన వైఎస్ఆర్సిపి నేత ఉప్పాల రాము అన్నారు. మంగళవారం పెడనలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలుగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై ఫిబ్రవరి 5వ తేదీన వైయస్సార్సీపి అండగా విద్యార్థి గళం పేరిట నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు పాల్గొన్నారు.