పెడన: టిప్పర్ ఢీ కొని వ్యక్తికి తీవ్రంగా గాయాలు

54చూసినవారు
పెడన: టిప్పర్ ఢీ కొని వ్యక్తికి తీవ్రంగా గాయాలు
పెడన మండలం కూడూరులో మట్టి టిప్పర్ ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టింది. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో రక్తపు మడుగుల్లో గాయపడ్డ కూడూరు గ్రామానికి చెందిన కాగిత రామకోటయ్యను హుటాహుటిన బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టిప్పర్ ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలతో ఉన్న కాగిత రామకోటయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు వేరే ప్రాంతానికి రిఫర్ చేశారు.

సంబంధిత పోస్ట్