గన్నవరంలో ఆదివారం జరిగే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు పెడన నియోజకవర్గం పరిసర ప్రాంతాల నుంచి హిందూ బంధువులందరూ బయలుదేరిన వాహనాలను ఆదివారం ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందువుల ఐక్యత చాటే విధంగా ఈ శంఖారావ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. హిందువులంతా ఒక్కతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.