పెడన పురపాల సంఘం అత్యవసర సమావేశాన్ని మున్సిపల్ ఛైర్పర్సన్ కటకం నాగకుమారి బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు 4 అంశాలను కౌన్సిల్ తీర్మానానికి ఉంచగా కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా 4 అంశాలను ఆమోదం చేశారు. అనంతరం నాగకుమారి మాట్లాడుతూ. పట్టణంలో జరగబోవు చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాలలో శానిటేషన్ సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, అధికారులు ఉన్నారు.