పెడన: మున్సిపల్ టౌన్ ప్లానింగ్ డైరీ-2025 ను ఆవిష్కరణ

56చూసినవారు
పెడన: మున్సిపల్ టౌన్ ప్లానింగ్ డైరీ-2025 ను ఆవిష్కరణ
పెడన మున్సిపల్ కమిషనర్ ఎం. గోపాలరావు బుధవారం ఆయన ఛాంబర్ నందు ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ టెక్నికల్ అఫీషియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన టౌన్ ప్లానింగ్ -2025 డైరీ ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, టౌన్ ప్లానింగ్ విభాగమునకు ఎంతో అవసరమైన ప్రాముఖ్యత కలిగిన మార్గదర్శక గ్రంథమని ఈ డైరీని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్