పెడన: ఆముదాలవలస యోగ పరిశీలకునిగా కాగిత

69చూసినవారు
పెడన: ఆముదాలవలస యోగ పరిశీలకునిగా కాగిత
ఆముదాలవలసలో ఈనెల 21వ తేదీన జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ను పరిశీలకునిగా ప్రభుత్వం ఆదివారం నియమించింది. ఈ మేరకు ఆయన ఆముదాలవలస తరలి వెళ్ళనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యోగాంద్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ను పరిశీలకునిగా నియమించడం పట్ల నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్