జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి తాగునీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం ఆయన తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద ఆకుమర్రు సమగ్ర రక్షిత నీటి సరఫరా అభివృద్ధి పనులు యస్. యస్ ఫిల్టర్స్ మరమత్తుల శంఖుస్థాపన కార్యక్రమములో పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తో కలిసి పనులను ప్రారంభించారు.