పెడన: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

77చూసినవారు
పెడన: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నట్లు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. బుధవారం పెడన నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో ప్రజాదర్బార్ ను నిర్వహించారు. ప్రజలు మరియు పార్టీ నేతల నుండి ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో పలు సమస్యల గురించి వినతిపత్రాలు అందజేయగా, వీటన్నిటి పరిశీలించి, త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్