వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన పట్టణ ఎస్సి విభాగం నాయకులు చుక్కా నరసింహారావు (65) మంగళవారం ఉదయం మృతి చెందారు. ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈయన పెడన జయలక్ష్మి బ్యాంకు డైరెక్టర్ గా, కాంగ్రెస్ పార్టీ పెడన పట్టణ ఉపాధ్యక్షులుగా గతంలో సేవలందించారు. తోటమాల ప్రాంతంలోని ఆయన నివాసంలో పలువురు నాయకులు నరసింహారావు మృతదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.