పెడన టౌన్ 1వ వార్డులోని శ్రీవీరవరపు వెంకటేశ్వరరావు ఇంటి నుండి అర్బన్ హెల్త్ సెంటర్ వరకు రూ. 8.80 లక్షల విలువగల సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా 14వ వార్డులోని యన్.టి.ఆర్ పార్కు నందు రూ. 5.16 లక్షల ఫుట్ పాత్, సీసీ కెమెరాలు, వీధి దీపాలు, సిమెంట్ బెంచీలు, ఇతర అభివృద్ధి పనులు బుధవారం జరిగాయి. ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాలు ఆవిష్కరించారు.