పెడన: ప్రమాద స్థాయిలో సీలేరు వంతెన

51చూసినవారు
పెడన: ప్రమాద స్థాయిలో సీలేరు వంతెన
పెడన మండలం లంకలకలవగుంట -నేలకొండపల్లి రోడ్డుపై ఉన్న శాంతమ్మ చెరువు పక్కన సిలేరు పంట కాలువపై వంతెన స్లాబు 2 అడుగుల మేర క్రిందకు జారిపోయింది. ఇప్పటికే వంతెన కింద భారీగా పగుళ్లు ఏర్పడి స్లాబ్ దిగజారి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. స్థానికుల వివరాల ప్రకారం ఇప్పటికే చాలా రోజులుగా వంతెన స్లాబ్ దిగిపోతున్నట్టు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్