అబద్ధపు సాక్ష్యం చెప్పాలంటూ యజమాని చేసిన వేధింపులు తాళలేక రౌతుల రమేశ్ అనే కార్మికుడు శుక్రవారం పెడన రైల్వే ట్రాక్పై ఆత్మహత్య చేసుకున్నాడు. పెడన పట్టణానికి చెందిన కేజీఎన్ బిర్యాని హోటల్ యజమాని బాజీ తన ఆర్థిక లావాదేవీల విషయంలో కోర్టుకు సాక్ష్యం చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చాడని రమేశ్ సెల్పీ వీడియోలో పేర్కొన్నాడు. పెడన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి కొట్టించాడని వాపోయాడు.