కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రమాదంలో ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బొడ్డు ఏడుకొండలు కుటుంబం సభ్యులకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన ప్రమాద బీమా రూ. 5 లక్షల మంజూరు లేఖను వారి ఇంటి వద్ద ఆదివారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.