పెడన: షార్ట్ సర్క్యూట్ తో వరిగడ్డివాములు దగ్ధం

68చూసినవారు
పెడన మండలం పెనుమల్లిలో ఆదివారం రాత్రి భయానక పరిస్థితి నెలకొంది. గ్రామ శివారులోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. భారీ శబ్దంతో ట్రాన్స్ ఫార్మర్ వద్ద నిప్పులు వచ్చాయి. ట్రాన్స్ ఫార్మర్ పక్కనే ఉన్న వరిగడ్డి వాములకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో పంట పొలాల్లో నిల్వ చేసిన వందల ఎకరాల వరిగడ్డివాములు దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్