పెడన: పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన బాధితులు

55చూసినవారు
పెడన మండలంలోని సుమారు 10 గ్రామాలకు చెందిన బాధితులు తమ పశువులు దొంగతనానికి గురైన ఘటనలపై న్యాయం కోసం పెడన పోలీస్ స్టేషన్ కు మంగళవారం చేరుకున్నారు. ఒక్కొక్కరి వద్ద రెండు, మూడు గేదెలు చోరీకి గురయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కొందరు నిందితులను గుర్తించారనే సమాచారం రావడంతో బాధితులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్