పెండింగ్ లో ఉన్న 6నెలల మెస్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గుడివాడ నియోజవర్గ సమితి ఆధ్వర్యంలో ఆదివారం బాలికల వసతి గృహాన్ని వారు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలన్నారు.