రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించండి

494చూసినవారు
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించండి
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించండని పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు సమ్మెట డిమాండ్ చేశారు. బుధవారం ఆయన లోకల్ యాప్ ప్రతినిధితో మాట్లాడుతూ గతంలో రేషన్ డీలర్ల అంటే ఒక గౌరవప్రదమైన వృత్తి గా ఉండేది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం లో గౌరవం మాట దేవుడెరుగు, డీలర్ల ఉనికే ప్రశ్నార్థకం అయిపోయిందని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల డీలర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు దీటుగా రేషన్ డీలర్లు రేషన్ అందించారని డీలర్స్ కు నెలల తరబడి కమిషనర్ రాక ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. గతంలో అయితే గోని సంచులు అమ్ముకునే మెసులుబాటు ఉండేది. జీవో నెంబర్ 10 ద్వారా రేషన్ డీలర్ల హక్కులను వైసీపీ ప్రభుత్వం హరిస్తుందని డీలర్ల సమస్యపై పౌరసరఫరాల శాఖ మంత్రి వెంటనే స్పందించాలని, పెండింగ్లో ఉన్న కమిషన్ బకాయిలు వెంటనే చెల్లించాలి
జీవో నెంబర్ 10 ని రద్దు చేయాలని,
రేషన్ డీలర్లు హక్కులను పరిరక్షించాలని,
డీలర్ల డిమాండ్ మేరకు గౌరవ వేతనం ఇవ్వాలని డీలర్ల హక్కుల పరిరక్షణకు, సమస్యపై పోరాటానికి జనసేన పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని ఎస్ వి బాబు సమ్మెట ప్రకటించారు.

ట్యాగ్స్ :