ఉయ్యూరు నగర పంచాయతీ ఎక్స్ అఫీషియో సభ్యునిగా పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బోడె ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. నగర పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు బోడె ప్రసాద్ ఉయ్యూరు నగర పంచాయతీ ఎక్స్ అఫీషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అలియాస్ వల్లభనేని నాని, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.