పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలో రామలింగేశ్వరస్వామి ఆలయంలో వేంచేసి ఉన్న పార్వతీదేవి అమ్మవారికి ఆషాడం సందర్భంగా ఆదివారం శాకాంబరి అలంకరణ చేపట్టారు. ప్రధాన అర్చకులు ఆలయంలో అమ్మ వారి విగ్రహానికి వివిధ రకాలైన కూరగాయులతో ప్రత్యేక అలంకరణ చేపట్టి శాకాంబరిగా చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. మహిళా భక్తులు పెద్దెత్తున మహిళలు వచ్చి ఆలయంలోని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు.