ఉయ్యూరు తహసిల్దార్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఉయ్యూరు మండల తహసిల్దార్ యం. సురేష్ కుమార్ జాతియ పతాకం ఆవిష్కరించారు. కార్యాలయపు సిబ్బంది మరియు పాఠశాల విద్యార్దులు పాల్గొనిరి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నాయకులు బానిస సంకెళ్ళను తెంపి విముక్తి కలిగించిన దేశ నాయకులను స్మరించుకొని వారి అడుగు జాడలలో దేశ ప్రజలందరూ నడవాలని పిలుపునిచ్చారు.