70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డు(తిరుచిత్రాంబలం) పొందిన జనసేన పార్టీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షులు జానీ మాస్టర్ ని కంకిపాడుకి చెందిన కృష్ణాజిల్లా ప్రచార కమిటీ కో ఆర్డినేటర్ పులి కామేశ్వరరావు శుక్రవారం అభినంధించారు. జానీ మాస్టర్ కి అవార్డు రావడంపై కామేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి జనసేన పార్టీకి పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.