కంకిపాడు: అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

251చూసినవారు
కంకిపాడు: అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
కంకిపాడులో అక్రమంగా నిల్వ చేసిన 8 క్వింటాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ సిబ్బంది గుర్తించి శనివారం రాత్రి సీజ్ చేసింది. పౌరసరఫరాల శాఖ డిటి ప్రధాన్ కి అందిన సమాచారం మేరకు ఆయన కంకిపాడు ఇన్చార్జి విఆర్ఓ రఘురామ్ ను దాడికి ఆదేశించడంతో కంకిపాడులోని బందరురోడ్డులోని ఒక పిండిమర్ర వద్ద నిల్వ ఉంచిన ఎనిమిది క్వింటాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని వేరే రేషన్ షాపు డీలర్ కు అప్పగించారు.

సంబంధిత పోస్ట్