కంకిపాడు మండలంలోని ఉప్పులూరులో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వద్ద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరుతో బ్యానర్ ను శుక్రవారం ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, మరియు సప్తగిరి గ్రామీణ బ్యాంకులు విలీనం అయ్యి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గా మారాయి. 2025 మే 1 నుండి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అమల్లోకి వచ్చింది.