లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు 2024 - 25 నూతన కార్యవర్గానికి ప్రెసిడెంట్ గా యువ వ్యాపారవేత్త, తేజ డిజిటల్స్ అధినేత నేరెళ్ళ తేజ సాయి వెంకట్ ని ఎంపిక చేసినట్టు లయన్స్ ముఖ్య ప్రతినిథులు శుక్రవారం ప్రకటించారు. కార్యాలయంలో జిల్లా డిప్యూటీ క్యాబినెట్ సెక్రటరీ నూకల వెంకట సాంబశివరావు పర్యవేక్షణలో నిర్వహించిన ముఖ్య ప్రతినిధుల సమావేశంలో లయన్స్ క్లబ్ ఉయ్యూరు నూతన కమిటీని ఎర్పాటు అంశాలను చర్చించారు.