ఊయ్యురు: పంచాయతీ భూమి కాపాడాలని వినతి

60చూసినవారు
ఉయ్యూరు రూరల్ గండిగుంట పంచాయతీ భూమిని కాపాడాలని సామాజిక కార్యకర్త దండమూడి వెంకట్రావు కోరారు. పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఆయన పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి శ్రీ కుమార్ వివరణ ఇస్తూ  రిజిస్టర్ వీలునామా ప్రకారం ఇంటి పన్ను విధించడం జరిగిందన్నారు. ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు

సంబంధిత పోస్ట్