కంకిపాడు మండలంలో త్వరలో మొబైల్ రైతు బజార్ ఏర్పాటు చేస్తున్నట్లు మండల టిడిపి సీనియర్ నాయకులు యలమంచిలి కిషోర్ బాబు బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. మొబైల్ రైతు బజారు ఏర్పాటు చేయమని రైతు బజార్ల ఉన్నతాధికారులను కోరినట్లు తెలిపారు. అవసరమైన అనుమతులు లభించిన తరువాత కంకిపాడు నందు మొబైల్ రైతు బజారు ఏర్పాటు నిర్వహించుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సమాచారం పంపించినట్లు కిషోర్ బాబు తెలిపారు.