వాతావరణ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యంను తరలించిన కంకిపాడు మండలం దావులూరు బాలాజీ రైస్ మిల్లును శుక్రవారం మరోసారి కలెక్టర్ డికె బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లుకు చేరుకున్న వెంటనే దిగుమతి చేయించాలని, వాహనానికి అదనపు కిరాయి చెల్లింపు, ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఖాళీ లేని మిల్లులకు ధాన్యాన్ని పంపవద్దని కలెక్టర్ సిబ్బందికి సూచించారు.